calender_icon.png 12 December, 2024 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణం తీసిన రీల్స్ కారు ఢీకొని యువకుడి మృతి.. కేరళలో ఘటన

12-12-2024 12:47:23 AM

తిరువనంతపురం, డిసెంబర్ 11: ప్రమోషనల్ వీడియో షూట్ ప్రాణాల మీదకు తెచ్చింది. వీడియో షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కారు ఢీకొని ఓ యువకుడు తీవ్రగాయాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కేరళలోని వడవరకుకు చెందిన అల్విన్ (20) యూఏఈలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తూ ఇటీవల స్వస్థలానికి వచ్చాడు. నెల్లికోడ్‌లో ఓ బిజినెస్ మ్యాన్ నెలకొల్పనున్న కార్ డీలర్‌షిప్‌కు సంబంధించిన ప్రమోషనల్ షూట్‌ను అంగీకరించాడు. సోమవారం కోజికోడ్ బీచ్ రోడ్‌లో రెండు లగ్జరీ కార్లతో వీడియో షూట్ ప్లాన్ చేశాడు.

అటు నుంచి ఒక కారు, ఇటు నుంచి కారు వస్తుండగా మధ్యలో అల్విన్ మొబైల్ పట్టుకుని వీడియో షూట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. కారు అల్విన్‌పై దూసుకువచ్చి ఎదురుగా వస్తు న్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో గాలిలో ఎగిరిపడిన అల్విన్ తీవ్రగాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడిని స్నేహితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అల్విన్ మృతిచెందాడు. వెల్లయిల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.