calender_icon.png 8 February, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమించాడని మందలించడంతో యువకుడి ఆత్మహత్య

08-02-2025 12:45:46 AM

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ప్రేమించాడని కుటుంబ సభ్యులు మందలించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దా పూర్ గ్రామంలో శుక్రవారం చోటుచే సుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరా ల ప్రకారం గ్రామానికి చెందిన మేకల యాదగిరి(22) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు.

అదే గ్రామానికి చెందిన ఓ యువతీతో సన్నిహితంగా మెలగడంతో యువకుడిని యువతి బంధువులు మందలించారు. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు.

విషయం తెలుసు కున్న పోలీసులు సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసు కుని మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ విషయంలో ఇరు కుటుంబ సభ్యు లు ప్రాణం ఖరీదు 15 లక్షల చొప్పున ఒప్పందం చేసుకుని రాజీ పడ్డట్లు తెలి సింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.