calender_icon.png 16 January, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

04-08-2024 01:11:38 AM

గద్వాల(వనపర్తి), ఆగస్టు 3 (విజయక్రాంతి): రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి గద్వాల పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్దకల్ మండల కేంద్రానికి చెందిన అశోక్(30) జిరాక్స్ షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పని నిమిత్తం స్వగ్రామం నుంచి గద్వాలకు వచ్చాడు. రాత్రి 7 గంటల సమయంలో తండ్రి శ్యాంకు ఫోన్ చేసి జీవితంపై విరక్తి ఉందని చెబుతూ.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.