04-03-2025 08:18:40 PM
కామారెడ్డి (విజయక్రాంతి): పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుందని ఎస్సై వెంకట్ రావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన కమ్మరి ప్రవీణ్ కుమార్ (27) నాన్న చాలా సంవత్సరాల క్రితం చనిపోగా, అమ్మ గత మూడు సంవత్సరాల క్రితం పాముకాటుతో మృతి చెందిందని, మృతుని అక్క మౌనికకు పెళ్లి చేయగా బావ తాగుడుకు బానిసై ఉరి వేసుకుని చనిపోయాడని, ప్రస్తుతం మృతుడు తన అక్కతో పాటు శెట్టిపల్లిలో ఉంటూ ఆటో నడిపించుకుంటు జీవనం గడిపే వాడని, అమ్మానాన్న, బావలు చనిపోవడం తనకు పెళ్లి కాకపోవడంతో మనోవేదనకు గురై మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని. అక్క వడ్ల మౌనిక పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు.