కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రగాయాలు
మెదక్, నవంబర్ 4 (విజయక్రాంతి): యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ యువతి మెదక్ పట్టణ శివారులోని అవుసులపల్లి గ్రామంలో బంధువు ల వద్ద ఉంటూ స్థానిక డిగ్రీ కళాశాలలో ఓపె న్ డిగ్రీ పరీక్షలు రాస్తోంది.
అయి తే, కొన్నాళ్ల నుంచి ఆమెను బెంగళూరుకు చెందిన చేతన్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నా డు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోప ంతో యువతిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్న యువతి వద్దకు వెళ్లిన చేతన్.. ఆమె మొబైల్‌ను పగులగొట్టాడు.
అనంతరం తన వెంట తీసుకొచ్చుకున్న కత్తి తో ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి చేతికి తీవ్రగాయం కావడంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న మెదక్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.