calender_icon.png 25 October, 2024 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగారకుడిపై ఏడాది

09-07-2024 02:11:17 AM

  • కృత్రిమ మార్స్‌లో 378 రోజులు గడిపిన నలుగురు వ్యోమగాములు 
  • ప్రయోగానికి వేదికైన హోస్టన్ నగరంలోని జాన్సన్ స్పేస్ సెంటర్ 
  • వ్యోమగాముల మనుగడ, మొక్కల పెంపకం తదితర వాటిపై అధ్యయనమే లక్ష్యం 
  • 2025, 2026లో మరో రెండు ప్రయోగాలు

న్యూఢిల్లీ, జూలై 8: అంగారక గ్రహంపై వ్యోమగాముల.. మనుగడ, ఆరోగ్యం, మొక్కల పెంపకం, ఆహార తయారీ తదితర వాటిపై అవగాహనే లక్ష్యంగా నాసా అంతరిక్ష కేంద్రం చేపట్టిన చాపియా (క్రూ హెల్త్ అండ్ ఫెర్మామెన్స్ ఎక్స్‌ప్లోరేషన్) మిషన్ విజయవంతం అయ్యింది. ఈ మిషన్‌లో భాగంగా హోస్టన్ నగరంలోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో.. ఒరిజినల్ మార్స్‌ను పోలి ఉండేలా ఓ కృత్రిమ మార్స్‌ను ఏర్పాటు చేసిన సైంటిస్టులు.. అందులోకి నలుగురు వలంటీర్లను పంపించింది. వారిలో ఒక వైద్యుడు, ఒక మిషన్ స్పెషలిస్టు, శిక్షణ పొందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ కృత్రిమ గ్రహంలో 378 రోజుల పాటు గడిపిన ఆ వలంటీర్లు గత శనివారం విజయవంతంగా బయటకు వచ్చారు.

మరో రెండు మిషన్లకు సై..

కాగా మార్స్‌పై మానవ మనుగడే లక్ష్యంగా ప్రయోగాలు చేపడుతున్న నాసా.. చాపియా మిషన్ విజయవంతం కావడంతో ఇలాంటివే మరో రెండు (2025, 2026 ఏడాదిలో) చేపట్టేందుకు సిద్ధం అవుతోంది