ఎంఆర్‌ఎఫ్ కంపెనీ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన కార్మికుడిని తొలగించొచ్చని, ఇలాంటి సంఘటనల్లో కేవలం సాంకేతిక కారణాలను దృష్టిలో ఉంచుకుని కార్మిక ట్రైబ్యునల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.
మెదక్‌కు చెందిన సంగమేశ్వర్ 1995లో ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్‌లో చేరాడు. క్రమంగా శాశ్వత ఉద్యోగిగా గుర్తింపు సాధించారు. సంగమేశ్వర్ 2008లో సూపర్‌వైజ ర్‌పై చేయిచేసుకున్నాడు. విధుల పట్ల నిర్ల క్ష్యం వహించాడు. దీంతో కంపెనీ అతడిపై విచారణ చేపట్టి ఉద్యోగం నుంచి తొలగించింది.
దీంతో సంగమేశ్వర్ కార్మిక ట్రిబ్యు నల్‌ను ఆశ్రయించగా, సింగిల్ జడ్జి సంగమేశ్వర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు నిచ్చారు. తీర్పును సవాల్ చేస్తూ మళ్లీ ఎంఆర్‌ఎఫ్ కంపెనీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. తనకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలంటూ సంగమేశ్వర్ సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
సంగమేశ్వర్ విషయంలో ఎంఆర్‌ఎఫ్ కంపెనీ తీసుకున్న నిర్ణయం సమర్థనీయమేనంటూ తీర్పు వెలువరించింది. సూపర్‌వైజర్‌పై చేయిచేసుకో వడాన్ని దుష్ప్రవర్తనగా పరిగణించాల్సిందేనని, చెప్పిన పని చేయకపోవడం, అవిధే యత కూడా క్రమశిక్షణారాహిత్యమేనని పేర్కొన్నది.
అలాంటి కార్మికుడిపై చర్య తీసుకోనిపక్షంలో మిగిలిన కార్మికులూ అలాగే తయారయ్యే అకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ కారణంతో తిరిగి కార్మికుడిని తిరి గి తీసుకోవాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని స్పష్టం చేసింది. కంపెనీ సంగమేశ్వర్‌కు ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరంలేదని తేల్చిచెప్పింది.