14-02-2025 11:46:44 PM
వాషింగ్టన్: డోజ్ అధినేత ఎలాన్ మస్క్ గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ బస చేసిన బ్లెయిర్ హౌస్‌లో తన పిల్లలతో కలిసి భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మీటింగ్‌కు మస్క్‌తో పాటు వచ్చిన ఒక మహిళ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఎవరా అని ఆరా తీయగా మస్క్ తాజా భాగస్వామి షివోన్ జిలిస్ అని బయటపడింది. ప్రస్తుతం షివోన్ జిలిస్.. మస్క్ స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్ విధులు నిర్వర్తిస్తోంది.
అంతకుముందు 2017 నుంచి 2019 వరకు టెస్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసింది. కెనడాకు చెందిన 39 ఏళ్ల షివోన్ జిలిస్ తండ్రి పేరు రిచర్డ్ కాగా.. తల్లి పేరు శారద. షివోన్ జిలిస్‌తో ఉన్న బంధాన్ని మస్క్ ఇప్పటివరకు ఎక్కడా బయటపెట్టలేదు. వీరిద్దరు కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం జిలిస్.. మస్క్ తన 11 మంది పిల్లల కోసం టెక్సాస్‌లో నిర్మించిన విలాసవంతమైన భవంతికి తన మకాం మార్చారు.