calender_icon.png 11 January, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ ఆడుతున్న మహిళకు గుండెపోటు

03-10-2024 12:48:23 AM

విషాదం నింపిన పండుగ

మంథని, అక్టోబర్ 2 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల లక్కారం గ్రామంలో బుధవారం విషాదం నెలకొంది. లక్కారం గ్రామానికి చెందిన మదాసి స్వరూ ప(45) బుధవారం సాయంత్రం బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటు రావడంతో కింద పడి మృతిచెందింది. స్వరూపకు ఇద్దరు కూతుర్లు ఉండగా, ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన స్వరూప మృతి చెందడంతో కుటుం బసభ్యుల రోదనలు మిన్నంటాయి.