calender_icon.png 20 November, 2024 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ రోగి నగలు అపహరణ

20-11-2024 02:20:28 AM

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

కామారెడ్డి, నవంబర్19 (విజయక్రాంతి) : శస్త్ర చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ నగలు అపహరణకు గురైన ఘటన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్నది. బాధితురాలి కథనం మేరకు.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన ఓ మహిళ శస్త్ర చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మంగళవారం వచ్చింది.

సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లే ముందు ఆమె ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారాన్ని తీసి ఆమెను లోపలికి పంపారు. సర్జరీ అనంతరం బయటికొచ్చి చూడగా నగలు కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని అడిగినా ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో సదరు మహిళ బంధువులు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.