రాయదుర్గం: హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. బైకును తప్పించబోయి పక్కనే ఉన్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని రత్నాబాయి(43)గా గుర్తించారు. స్థానికుల సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.