ఆదిలాబాద్ (విజయక్రాంతి): పంట చెనులో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇచ్చోడ మండలం మల్యాల గ్రామానికి చెందిన రాజుబాయి (65) చెనులో వ్యవసాయ పనులం కోసం వెళ్లింది. ఐతే అక్కడ అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. రాజుబాయి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గత నెల 31న ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా రాజుబాయి కుటుంబీకులు వెతకగా బుధవారం పొలంలో మృతదేహం లభ్యమైనది.