అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 10: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన బసవపురం లలిత (45) ఓఆర్‌ఆర్ హెచ్‌ఎండీఏ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. లలిత మంగళవారం మధ్యాహ్నం తారామతిపేట ఔటర్ రింగ్ రోడ్డు డివైడర్ మధ్య చెట్లను తొలగిస్తున్న క్రమంలో ఘట్‌కేసర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన లలితను స్థానికులు సమీపంలోని శ్రీకర్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.