హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): అందరూ చూస్తుండగానే ఓ గుర్తు తెలియని మహిళ శుక్రవారం చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై నుంచి మూసీలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కాచిగూడ పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అసలు ఆ మహిళ ఎవరు? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.