28-02-2025 08:15:36 PM
కూకట్ పల్లి (విజయక్రాంతి): ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కెపిహెచ్బి కాలనీ ఆరో ఫేజ్ లో నివాసం ఉంటున్న బండ్ల పూజశ్రీ(31) తన భర్త సునీల్ తో కలిసి ఉంటుంది. పూజశ్రీ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదని పోలీసులు పేర్కొన్నారు. సోదరి సౌమ్య శ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.