కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి తండాలో వెలుగు చూసిన ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): కడుపునొప్పి బాధ భరించలేక మహిళ ఆత్మహత్య ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి తండా గ్రామంలో చోటుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. తిమ్మారెడ్డి తండా గ్రామానికి చెందిన దరావత్ శారద(28) గత కొన్ని రోజుల నుండి కడుపునొప్పితో బాధపడుతు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నెల 24న శారద భర్త బర్రెలను పోలంలో కట్టి వేయడానికి వెళ్లగా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి శారద ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై బొజ్జమహేష్ తెలిపారు. శారద భర్త దేవిసింగ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దార్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.