హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో విద్యను అం దిస్తూ స్వదేశీ, విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్నది. ఉన్నత స్థా యి ప్రమాణాలతో కూడిన అధ్యయన పరిశోధన కేంద్రంగా విలసిల్లుతున్నది. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక అంశాలపై అధ్యయన పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాలి. మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ సెంటర్ ఏర్పరచి వివిధ విభాగాల్లో లోతైన అధ్యయనం, పరిశోధనా కార్యక్రమాలు చేపట్టాలి. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి, సహజ వనరులు, భూమి లభ్యతమీద స ర్వేలు నిర్వహించాలి.
నేలల స్వరూపం, స్వభావం పంటల తీ రు, జలవనరుల లభ్యత, నీటిపారుదల సౌకర్యాలు, చెరువు లు, కుంటల సంరక్షణ, ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద రైతులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి. చేతివృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ర, స్థానిక ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు అమలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవా ళ్లను పరిష్కరించే విధానాలను రూపొందించడం, చిన్న, ల ఘు, కుటీర, గామీణ పరిశ్రమల అభివృద్ధికి కార్యాచరణ ప్ర ణాళికల రూపకల్పనకు శాస్త్రీయ అధ్యయంతో పరిశోధన కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంది.
వెనుకబడిన ప్రాం తాల గుర్తింపు వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు, సాంకేతి క పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం ప్రత్యేక ప్రాజెక్టుల రూపకల్పన, స్థానిక సంస్థలకు ఆర్థిక సాధికారిత వంటి అంశాలపట్ల సమగ్రమైన ఆర్థిక పాలనా విధానాలను రూపొం దించవలసి ఉంది పాలకులకు, ప్రభుత్వ యంత్రాంగానికి ఈ కేంద్రం ఒక దశ దిశను నిర్దేశించాలి. భారతదేశంలోని మి జోరాం, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో సామాజిక ఆర్థిక అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆయా రాష్ట్రాలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేశాయి. అదే తరహాలో, తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం కూడా అధ్యయన పరిశోధన కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ రకమైన అజెండాతో హైదరాబాద్ యూనివర్సిటీలో స్వతంత్ర ప్రతిపత్తితో తెలంగాణ సమస్యల పరిశోధన అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పి రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిద్దాం.
- నేదునూరి కనకయ్య