08-04-2025 12:00:00 AM
అగ్రవర్ణ అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఆ వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కు తున్న చిత్రం ‘దండోరా’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా, తాజాగా మేకర్స్ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించారు.
25 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో నటుడు శివాజీ సహా పలువురు నటులపై సన్నివేశాల ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాఖమూరి; సంగీతం: మార్క్ కే రాబిన్; ఎడిటర్: సృజన అడుసుమిల్లి; ఆర్ట్: క్రాంతి ప్రియం.