calender_icon.png 5 February, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవాణారంగ కార్మికులకు సంక్షేమ చట్టం చేయాలి

05-02-2025 08:00:39 PM

ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జమలయ్య...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రవాణారంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆటో వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం 'శేషగిరి భవన్'లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జమలయ్య మాట్లాడుతూ... ఆటో, ప్రవేటు వాహనాలను నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్న రవాణారంగ కార్మికుల సంక్షేమాన్ని పాలకులు విస్మరించారని ఆరోపించారు.

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు తరహాలో రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికులు ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డుపై తీర్మానం చేసి కేంద్రంపై వత్తిడి తేవాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటో కార్మికులు నష్టపోతున్నారని ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభి కార్మికుడికి రూ.12వేలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు ఈ చలాన్లు, పన్నుల నుంచి మినహాయించాలని, సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమావేశంలో నాయకులు బత్తులు సత్యనారాయణ, మర్రి కృష్ణ, భాస్కర్ జనార్ధన్, ఆరెల్లి కృష్ణ, నరసింహ గణేష్, చింటూ, కోటి రామరాజు, రాజు, రాంబాబు, భద్రం తదితరులు పాల్గొన్నారు.