17-03-2025 12:47:53 AM
సిద్దిపేట, మార్చి 16 (విజయక్రాంతి): కళాకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ కళాకారుల వేదిక వ్యవస్థాపకులు కామల్ల ఐలయ్య అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన కళాకారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కళాకారులను రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు మోసం చేశాయన్నారు. గత ప్రభుత్వం 500 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా సబ్బండ కులాల కళాకారులను రోడ్డు పాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్న కళాకారులను పట్టించుకున్న పాపను పోలేదని, వృత్తిపరమైన కళాకారులను ఆదుకొని పెన్షన్ ఏర్పాటు చేయాలని, సంక్షేమ నిధులు రూ.1000 కోట్లు కేటాయించి కళాకారులను అభివృద్ధి బాటలో నడిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కళాకారులు కదిలి ఉద్యమాలు చేస్తారని సూచింఠ చారు.
తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి మాట్లాడుతూ కళాకారులు సంఘటిత ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని, ప్రభుత్వం వెంటనే కల్చరల్ పాలసీ ప్రకటించాలని, అన్ని శాఖలలో కల్చరల్ కోటా ను ఏర్పరిచి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రోజు వెంకటాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల నరసింహులు, జిల్లా నాయకులు దాసు, జాలిగామ గంగాధర్, రేణుక, సుజాత చిరంజీవులు, రాజు, ఎల్లం తదితరులు పాల్గొ న్నారు. అనంతరం జిల్లా అడహక్ కమిటీ ప్రకటించారు. జిల్లా కన్వీనర్ గా ఎర్రవల్లి శ్రీనివాస్, కో కన్వీనర్ గా శ్రీనివాస్ యాదవ్, భూపతి, దాసు, బొమ్మారం ఎల్లం, వెంకటపురం రాజు, మోతేని రేఖ జాలిగామ సుజాత మెట్టుపల్లి కనకరాజు, గజ్వేల్ సూర్యవంశీ, చొప్పరాజు లు నియామకం చేశారు.