తోటి ఉద్యోగితో సరదాగా గడిపిన సునీతా విలియమ్స్
న్యూ ఢిల్లీ, జూలై 22: ప్రముఖ వ్యోమగామి, భారత సంతతి మహిళా శాస్త్రవేత్త సునీతా విలియమ్స్ అంతరిక్షంలో తన వారాంతపు సెలవును ఎంజాయ్ చేసింది. బోయింగ్ క్రూ ఫ్లుటై టెస్ట్‌లో భాగమైన సునీతా, ఆమె సహోద్యోగి స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. గేమ్స్ ఆడటంతో పాటు స్పేస్ నుంచి భూమిని చూస్తూ ఎంజాయ్ చేశారు. పదిరోజుల యాత్రలో భాగంగా జూన్ 5న సునీత, విల్‌మోర్ ఈ రోదసి యాత్ర చేపట్టారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం 2 సార్లు వాయిదా పడింది. అయితే వారిద్దరూ సురక్షితంగా ఉన్నారని, ఐఎస్‌ఎస్‌లో వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయని నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం తెలిపింది. అయితే వారి తిరుగు ప్రయాణం కొత్త తేదీని ప్రకటించలేదు. కాగా సునీతా విలియమ్స్‌కి ఇది మూడో రోదసి యాత్ర. ఇదివరకు 2006, 2012లో ఆమె ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు.