రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పశ్చిమ, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్టు హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వెల్లడించింది. ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.