calender_icon.png 9 January, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోధుడి ప్రేమకథ

07-01-2025 12:00:00 AM

బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్, రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తొలి చిత్రం ‘ఆజాద్’. హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు అభిషేక్ కపూర్ తెరకెక్కిస్తున్నారు. చరిత్రాత్మకమైన హాల్దీఘాట్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా నిర్మాత.

ఇందులో అజయ్ దేవగణ్, డయానా పెంటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా జనవరి 17న విడుదల కానుందని వెల్లడిస్తూ.. ‘ఓ యోధుడి ప్రేమకథ’ అని పేర్కొంది. ఈ చిత్రబృందం తాజాగా సోమవారం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ‘ఆజాద్’ సందడి కనిపిస్తోంది.