అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట సర్కిల్ పరిధిలోని గత మూడు సంవత్సరాల నుండి పేకాట, కోడిపందాల కేసులలో ఉన్న నిందితులను, కోడి కత్తులు తయారు చేయు, కోడికత్తులు కట్టేవారిని, పేకాట రాయుళ్ల అందరిని మంగళవారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రాబోయే సంక్రాంతి పండుగ ఉద్దేశించి వారికి అశ్వారావుపేట, దమ్మపేట ఎస్ఐ లు యాతాతి రాజు, సాయి కిషోర్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో కోడిపందాలు, పేకాటలలో పాల్గొనకుండా వారిని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి బైండోవర్ చేసినట్టు ఎస్ఐ లు తెలిపారు. సర్కిల్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి కోడిపందాలు, పేకాటకాని నిర్వహించకూడదని ఒకవేళ నిర్వహించినచో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పేకాట, కోడిపందాల గురించి సమాచారాన్ని పోలీసులకు గాని, డయల్ 100 ద్వారా కానీ, లేదా అశ్వరావుపేట ఎస్సై ఫోన్ నెంబర్ 8712682062 కి కాల్ చేసి సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.