ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 15: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసీ.శేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మహేష్‌గౌడ్‌కు.. తెలంగాణ సాంప్ర దాయ బద్దంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈసీ.శేఖర్.. మహిళామణులతో కలిసి బోనాలతో ఘన స్వాగతం పలికారు. మహేష్ గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.