calender_icon.png 27 December, 2024 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం పలకాలి

05-11-2024 01:38:34 AM

  1. భారీగా జనసమీకరణ చేయాలి 
  2. పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం 
  3. హైదరాబాద్ జిల్లా నేతలతో సమావేశం

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఘనంగా స్వాగతం పలకాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పిలుపునిచ్చారు. కులగణనపై మే ధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులసంఘాల నాయకులతో సమావేశమై అభిప్రాయ సేకరణకు రాహుల్‌గాంధీ మంగళవారం తెలంగాణకు వస్తు న్న విషయం తెలిసిందే.

ఈ మేరకు హైదరాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల తో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ప్రతి డివిజ న్ నుంచి వందల సంఖ్యలో పార్టీ శ్రేణులను సమీకరించి బేగంపేట ఎయిర్‌పోర్టులో రా హుల్‌కు ఘనంగా స్వాగతం పలికాలని సూ చించారు.

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బోయినపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పా టు చేయాలని పేర్కొన్నారు. జనసమీకరణకు సంబంధించి హైదరాబాద్, సికింద్రా బాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇన్‌చార్జీలను నియమించారు.