calender_icon.png 23 March, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం

22-03-2025 07:54:31 PM

భారీ గజమాలతో సత్కరించిన ముదిరాజులు..

గజ్వేల్: సిద్దిపేట జిల్లా సరిహద్దు వంటిమామిడిలో శనివారం ఎమ్మెల్సీ కవితకు రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవితను  గజమాలతో సత్కరించారు.  ముదిరాజుల సమస్యలను శాసనమండలిలో లేవనెత్తడం పట్ల ముదిరాజులు ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీసీడీ నుండి ఏ కు రిజర్వేషన్ మార్చే వరకు తమకు మద్దతుగా నిలవాలని, చెరువులు కుంటలపై పూర్తి హక్కులు కల్పించే వరకు అండగా నిలవాలని, చేపల పెంపకానికి ప్రభుత్వం నుండి నిధులు సాధించాలని కోరారు. ముదిరాజులు ఎప్పుడూ ఎమ్మెల్సీ కవితకు రుణపడి ఉంటామన్నారు.