నారాయణఖేడ్, జనవరి 18: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త యువకుడు మల్లికార్జున్ అప్పాజీ నారాయణ ఖేడ్ కు వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి ఆయనతోపాటు శిష్యులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన సభాస్థలిలో ప్రవచనాలను అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు అప్పాజీకి వారి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడిచి ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని సూచించారు.
నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో దివంగత ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి సతిమణి గాళ్ళమ్మ,డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.