calender_icon.png 27 December, 2024 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం

05-11-2024 01:04:23 AM

 జకర్తా, నవంబర్ 4: ఇండోనేషియాలోని మౌంట్ లవోటోబీ లకి లకి అగ్నిపర్వతం బద్దలైంది. దాని నుంచి వెలువడుతున్న లావా, పొగ కారణంగా 9 మంది చనిపోయారు.  కొన్ని రోజులుగా మౌంట్ లవోటోబీ అగ్నిపర్వతం నుంచి విస్ఫోటనాలు ఏర్పడుతున్నాయి. గురువారం నుంచి ప్రతిరోజు దాదాపు 2 వేల మీటర్ల ఎత్తున బూడిదను అగ్నిపర్వతం వెదజల్లినట్లు అధికారులు తెలిపారు.

లావా కారణంగా పలు గ్రామాలు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షం పడుతుండడంతో సమీప  గ్రామాలను ఖాళీ చేయించారు. అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కాగా ఇండోనేషియా అంతటా ఇటీవల వరుస అగ్నిపర్వతాలు బద్దలవుతుండడంతో కొన్ని ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో హల్మహెరా దీవిలోని ఇబు పర్వతం పేలడంతో 60 మందికి పైగా మరణించారు.