calender_icon.png 7 January, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధార్‌తో గుర్తింపునిచ్చిన దార్శనికుడు

31-12-2024 03:19:08 AM

  • ప్రపంచ వాణిజ్యానికి దేశపు ద్వారాలు తెరిచిన నేత
  • దేశాన్ని ఆర్థిక సౌధంగా మార్చిన ఘనుడు మన్మోహన్  
  • ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): సంస్కరణలతో దేశాన్ని ఆర్థిక సౌ ధంగా మార్చిన నేత దివంగత మాజీ ప్రధా ని మన్మోహన్‌సింగ్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నా రు. దేశ జీడీపీలో 55శాతం ఐటీ, ఐటీఈఎస్ సర్వీలు దోహదపడుతున్నాయని, ఇది మన్మోహన్ ఘనతేనని చెప్పుకొచ్చారు.

1990లో తీసుకొచ్చిన సంస్కరణల వల్లే హైదరాబాద్ ఇన్నోవేషన్, ఐటీకి హబ్‌గా మారిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో మన్మోహన్ సంతాప తీర్మానంపై మంత్రి మాట్లాడారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన చట్టాల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయన్నారు. ‘ఆధార్’తో ప్రతి పౌరు డికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దార్శనికుడు అని అన్నారు.

దేశ రాజకీయాల్లో ఆయనను మహోన్నత శిఖరంగా శ్రీధర్‌బాబు అభివర్ణించారు. తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు 1991లో మన్మోహన్‌ను ఆర్థికమంత్రిగా చేసి కొత్త శకానికి నాంది పలికారన్నారు. సాధారణ స్థాయి నుంచి ఆయన ప్రధాని స్థాయికి ఎదిగారని వివరించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాం ధీ, పీవీ భారత ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డారన్నారు.

ఈ నలుగురి ఆలోచనల పునాదు లపై మన్మోహన్‌సింగ్ అనేక పాలసీలను రూపొందించారని తెలిపారు. నెహ్రూ హ యాంలో మిశ్రమ ఆర్థిక విధానాలతో కాంగ్రె స్ ప్రభుత్వం ముందుకెళ్లిందని.. ఆ తర్వాత ఇందిరాగాంధీ మరిన్ని మార్పులు చేశారని గుర్తు చేశారు. 80వ దశకంలో వచ్చిన రాజీవ్‌గాంధీ దేశానికి సాకేంతికను పరిచయం చేశారని.. 90వ దశకంలో పీవీ సారథ్యంలో మన్మోహన్ సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చారన్నారు.

ఈ విధానాలు గడ్డుకాలంలో ఉన్న దేశ ఆర్థికస్థితికి దోహదపడ్డాయ న్నారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌కు మన్మోహన్‌సింగ్ నాంది పలికారన్నారు. ఆయన హయాంలోనే ఐటీ, సర్వీస్ సెక్టార్ వృద్ధి పెరిగిందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి ఆయన దేశపు ద్వారాలను తెరిచారన్నారు. పదేళ్ల పాలనలో మన్మోహన్‌సింగ్ 114 ప్రెస్‌మీట్లు నిర్వహించారని, ఇప్పుడున్న ప్రధాని మౌనంగా ఉంటున్నారన్న ముద్ర పడిందని శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు.