కామారెడ్డి జిల్లాలో ఒక్కరోజే 2,500 కోళ్లు మృత్యువాత
కామారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బాన్సువాడ నియోజక కిష్టాపూర్ గ్రామంలో లింగం అనే రైతు నిర్వహిస్తున్న కోళ్ల షెడ్డులో 2,500 కోళ్లు ఒక్కరోజే అంతుచిక్కని వైరస్‌తో మృతిచెందాయి.
పశువైద్య అధికారులు కోళ్లను పరి అంతుచిక్కని వైరస్ వల్లే మృతిచెందాయని తెలిపారు. సుమారు రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగిందని రైతు లిం ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్లకు వస్తున్న అంతుచిక్కని వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోళ్ల ఫాం యాజమానులకు జిల్లా పశువైద్యాధికారి సునిల్‌కుమార్ తెలిపారు.