calender_icon.png 20 April, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన పూరిల్లు

12-04-2025 05:20:29 PM

బాధిత కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఆర్థిక చేయూత..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని ములకలపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో బల్ద అరుణమ్మకు చెందిన పూరిల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. స్థానిక బిఆర్ఎస్ నాయకులు వెంటనే నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీ మెచ్చ నాగేశ్వరావుకు విషయం తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి రూ.5 వేలు ఆర్థిక సహాయం చేశారు. గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రూ 21 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC సున్నం నాగమణి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, పార్టీ సీనియర్ నాయకుడు భారత రాంబాబు కుమ్మరి రాంబాబు, అచ్చున కృష్ణారావు రొంటి నాగేశ్వరరావు, చిన్నం సుదాకర్, భారత నాగేశ్వరరావు, రసాపుత్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.