calender_icon.png 29 November, 2024 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడకేసిన పల్లె పాలన?

29-11-2024 12:31:33 AM

  1. జనవరి 31తో ముగిసిన సర్పంచుల పదవీకాలం 
  2. గ్రామాల పైపు కన్నెత్తి చూడని ప్రత్యేక అధికారులు
  3. కార్యదర్శులపై పెరిగిన పని భారం
  4. నిధుల కొరతతో అస్తవ్యస్తంగా పారిశుధ్యం
  5. వీధి దీపాలు కూడా అమర్చలేని దుస్థితి
  6. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.ఇంచార్టులు, ప్రత్యేక అధికారులు తమ విధుల్లోనే బీజీగా ఉంటూ పంచాయతీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఉన్నతాధికారులు గ్రామాల్లోకి వచ్చినప్పుడే ప్రత్యేక అధికారులు కూడా దర్శనమిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. కాగా నిధుల కొరతతో పంచాయతీ కార్యదర్శులు సతమతమవుతున్నారు. ప్రత్యేక అధికారుల నియామకం అనంతరం 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినప్పటికీ పాత బకాయిల చెల్లింపునకే సరిపోలేదు.

ఫలితంగా పల్లెల్లో మురికి కాలువలు, బ్లీచింగ్, దోమల నివారణకు మందు పిచికారీ, వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోనూ విద్యుత్ దీపాలు అమర్చలేని దుస్థితి. సర్పంచుల పదవీ కాలం జనవరి 31న ముగియడంతో జిల్లాలోని 335 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

వీరికి నిధులు, విధులపై స్పష్టత లేకపోవడంతో వారు గ్రామాలపై దృష్టి సారించడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నిధుల కొరతతో పంచాయతీ కార్యదర్శులు అభివృద్ధి పనులు, కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ఉపాధి హామీ పథకం నిర్వహణ, పన్నుల వసూలు, జనన, మరణాల నమోదు, కల్యాణలక్ష్మి తదితర ధ్రువపత్రాల జారీతో పాటు ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న కుటుంబ సర్వేతో వారిపై పనిభారం పెరిగింది.

పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు చేసి పనులు చేపడుతున్నారు. కొన్నిచోట్ల పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయి. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.

సమస్యలు పెరుకుపోతున్నాయి..

గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రత్యేక అధికారులు గ్రా మాలకు సక్రమంగా రావడం లేదు. తాగునీరు, విద్యుత్, గుంతల రోడ్లు.. ఇలా సమస్యలు తీవ్రమయ్యాయి. వర్షాకా లంలో కనీసం ఇసుక  వేయలేని దుస్థితి ఉండే. కార్యదర్శులను అడిగితే నిధులు రావడం లేదు.. మే మేం చేయాలని అంటున్నారు. మురి కి కాలువలు నిండి మురుగు రోడ్లపై పారుతోంది. 

 రాజయ్య, గుండి గ్రామం, 

ఆసిఫాబాద్