calender_icon.png 5 October, 2024 | 2:48 AM

వీసీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి

05-10-2024 12:00:00 AM

ఓయూ జేఏసీ నాయకులు సర్దార్ వినోద్, పేరాల ప్రశాంత్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీ వీసీగా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ వెంకటరమణపై విజిలెన్స్ విచార ణ చేపట్టాలని ఓయూ జేఏసీ నాయకులు సర్దార్ వినోద్,  పేరాల ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.

శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడు తూ.. హెచ్‌సీయూ ప్రొఫెసర్‌గా ఉన్న వెంకట రమణను గత ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీగా నియమించిందన్నారు. ఆయన డీపీఆర్‌లు లేకుండానే పనులు చేపట్టారని, వీసీ అయినప్పటికీ బాసర ట్రిపుల్ ఐటీలో ఉండకుండా  హైదరాబాద్‌లో ఉండి లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

వెంకటరమణ వీసీగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. మెస్‌ల కాంట్రాక్టర్ గడువు ముగిసినా వారితోనే నిర్వహిస్తున్నారని, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, మహిళా అధ్యాపకులను లైంగికంగా వేధిస్తున్నారని ఆరో పించారు.

ఉన్నత విద్యామండలి, ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అక్రమాలపై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవిస్తామన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు పల్స ఆంజనేయులు గౌడ్, ప్రవీణ్‌కుమార్, రంజిత్ కుమార్, జిల్లపెళ్లి దిలీప్ కుమార్, సురేశ్ కుమార్, రమేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.