ఐటమ్ సాంగ్ అనగానే ప్రస్తుతం అందరికీ గుర్తుస్తున్న పేరు నోరా ఫతేహి. తాజాగా ‘మట్కా’ చిత్రంలోని ‘లే లే రాజా..’ గీతం ఇటీవల విడుదలై సోషల్ మీడియాను షేక్ చేయడం ఇందుకు చక్కటి ఉదాహరణ. నోరా.. కొన్నాళ్ల క్రితం ‘దిల్‌బర్’ అనే పాటలో నటించింది. ఆ సాంగ్ గురించి ఇటీవల ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. “నేను ‘దిల్‌బర్’ పాటను ఓ ఐటెమ్ సాంగ్‌లా మార్చేసి హాట్ అండ్ సెక్సీగా కనిపించేలా చేయొచ్చు.. లేదంటే ఎక్కువ డ్యాన్స్ ఆధారంగా సాగే పాటగా మార్చొచ్చు.
అలాంటి పాట కుటుంబాలతో చూసేలా ఉంటుంది. ‘డ్యాన్స్ ఏంటి? హుక్ స్టెప్ ట్రై చేద్దాం’.. అని వాళ్లకు అనిపించాలి. అలాంటి పాటలు చాలా రోజుల వరకు గుర్తుంటాయని మేకర్స్‌కు చెప్పా. కొరియోగ్రఫీ హేవీగా ఉండేలా చూసుకున్నా. ఆ సమయంలో వాళ్లు నాకు ఓ బ్లౌజ్ ఇచ్చారు. అది మరీ చిన్నగా ఉంది. అది చూసి నన్ను మరీ ఎక్కువ సెక్సువలైజ్ చేయొద్దని చెప్పా. ఇది సెక్సీ సాంగే అయినా.. మరీ అసభ్యకరంగా ఉండొద్దన్నా. మరుసటి రోజు ఉదయం వాళ్లు మరో బ్లౌజ్ రెడీ చేశారు. దాంతోనే నేను పాట పూర్తి చేశా.
అది కూడా చాలా మందికి చిన్నగానే అనిపించొచ్చు. కానీ ముందు ఇచ్చినదాని కన్నా ఇది చాలా మెరుగ్గానే ఉంది” అని చెప్పుకొచ్చింది నోరా ఫతేహి. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘మడ్గావ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో కనిపించింది. ఇక టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టనుంది. వరుణ్‌తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ‘మట్కా’లో నోరా నటిస్తోంది.