16-03-2025 01:49:35 AM
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీరధీరశూర’. ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వంలో హెచ్‌ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా పార్ట్ మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సిని మా టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్‌లో విక్రమ్ ఓ ఫ్యామిలీ మ్యాన్‌గా, రివేంజ్ తీర్చుకునే ఇంటెన్స్‌పర్సన్‌గా రెండు కోణాల్లో కనిపించారు. దుషార విజయన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డీవోపీ: తేని ఈశ్వర్ ఐఎస్‌సీ; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.