21-02-2025 07:24:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రాల్లో ఆచరణకు అమలు కాని హామీలతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను వ్యవసాయ కూలీలను కౌలు రైతులను అన్యాయానికి గురి చేసిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పద్మ అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని కౌలు రైతులను ఆదుకోవాలని ఉపాధి హామీ వ్యవసాయ కూలీలకు 12000 చెల్లించాలని పెన్షన్లను పెంచాలని వారు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట రాములు నూతన కుమార్ తిరుపతి ముత్తన్న కిషన్ తదితరులు ఉన్నారు.