టీయూడబ్ల్యూజే ఐజేయు డైరీని ఆవిష్కరించిన ఎస్పీ రోహిత్ రాజ్..
భద్రాద్రి కొత్తగూడెం: జర్నలిస్టు విలువలను కాపాడుతున్న యూనియన్ గా టీయూడబ్ల్యూజే ఐజేయు మరింత ముందుకు సాగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో టియుడబ్ల్యూజే ఐజేయు డైరీని ఆవిష్కరించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. జర్నలిస్టు విలువలను కాపాడేందుకు మరింత చైతన్యవంతమైన కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న టియుడబ్ల్యూజే ఐజేయు బృందాన్ని అభినందించారు. జిల్లాలోని జర్నలిస్టులకు సంబంధించి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎర్ర ఈశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు బి శంకర్, దశరథ రజువా తదితరులు పాల్గొన్నారు.