11-02-2025 10:30:46 PM
వ్యక్తికి తీవ్ర గాయాలు..
పరిస్థితి విషమం..
టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే టేకులపల్లి నుంచి బోడు వెళ్లే మార్గంలో సామ్యతండా గ్రామంలోని పాఠశాల ఎదురుగా, రోడ్డు మరమ్మతుల కోసం కంకర్ కుప్ప పోయడం జరిగింది. చీకట్లో దానిని గుర్తించని ఆ వ్యక్తి కంకర్ కుప్పను ఢీకొట్టడంతో ద్విచక్రవాహనం చోదకుడు కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు మండలంలోని బద్దుతండ గ్రామానికి చెందిన మంగీలాలుగా గుర్తించారు. ఆయనను స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి సకాలంలో రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై సమీపంలోని ఆర్ఎంపీ వైద్యులు వద్దకు తీసుకెళ్లి ప్రధమ చికిత్స నిమిత్తం తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.