calender_icon.png 11 January, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిరికల్ వీడియో ఎడిటింగ్‌పై రెండ్రోజుల వర్క్‌షాప్

03-11-2024 04:27:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): సినిమా ప్రమోషన్‌లో ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్, ట్రైలర్‌తో పాటు లిరికర్ వీడియోలు కూడా ఎంతగానో దోహదపడతాయని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో లిరికల్ వీడియో ఎడిటింగ్‌పై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఎలాంటి అంశాలు పాటించి ఎడిట్ చేయాలి (టూల్స్, స్పెషల్ ఇమేజెస్, గ్రాఫిక్స్ షాట్స్), పాట థీమ్‌కి అనుగుణంగా ఎలాంటి విషయాలు పాటించాలనే అంశాలపై సీనియర్ టెక్నీషీయన్స్‌తో తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 90141 98366, 63048 80031 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.