calender_icon.png 16 November, 2024 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురిసిన గాఫ్

11-11-2024 12:12:08 AM

  1. డబ్ల్యుటీఏ టైటిల్ సొంతం
  2. రికార్డు నెలకొల్పిన అమెరికన్ టీనేజర్

  3. కోకో గాఫ్ ఇప్పటి వరకు ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అలాగే 9 సింగిల్స్ టైటిల్స్‌ను దక్కించుకుంది. 

డబ్ల్యుటీఏ టోర్నీ గెలిచిన రెండో అమెరికన్ ప్లేయర్ గాఫ్.. 2013లో సెరెనా విలియమ్స్ గెలుచుకుంది.  

రియాద్: అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ సంచలనం సృష్టించింది. జెంగ్ క్వినెన్ (చైనా)తో జరిగిన డబ్ల్యుటీఏ ఫైనల్స్‌లో 3 6 7 (2) విజయం సాధించి కొత్త రికార్డులను నెలకొల్పింది. మారియా షరపోవా (రష్యా) తర్వాత డబ్ల్యుటీఏ టైటిల్‌ను గెలిచిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ తర్వాత అమెరికా టెన్నిస్ చరిత్రలో గాఫ్ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. 

మొదటి సెట్ కోల్పోయినా.. 

ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌లో కోకో గాఫ్ తొలి సెట్‌ను కోల్పోయింది. దీంతో గాఫ్ పని ఖతం అని అంతా అనుకున్నారు. మ్యాచ్‌కు ముందు కూడా గాఫ్ ఓడిపోతుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే గాఫ్ కూడా తొలి సెట్ కోల్పోయింది. ఇక గాఫ్ ఓడుతుందని అంతా అనుకుంటున్న సమయంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో గాఫ్ పుంజుకుని మ్యాచ్ గెలిచిన తీరు అమోఘం. ప్రత్యర్థి క్రీడాకారిణి చేసిన అనవసర తప్పిదాలు కూడా గాఫ్‌కు కలిసొచ్చాయి. రెండు సెట్లు ముగిసేసరికి ఇద్దరు చెరో సెట్ గెలిచి నిలిచారు. ఇక ప్రతిష్టాత్మక మూడో సెట్ మరింత హోరాహోరీగా సాగింది. ఈ సెట్ టై బ్రేకర్‌కు కూడా దారి తీసింది. అయినా గాఫ్ ఈ సెట్‌ను కూడా గెల్చుకోవడంతో మ్యాచ్ గాఫ్ సొంతమైంది. 

రికార్డుల మోత

ఈ మ్యాచ్ ద్వారా అనేక రికార్డులు నెలకొన్నాయి. ఈ టోర్నీలో గాఫ్ వరల్డ్ నంబర్ 1, నంబర్ 2 ఆటగాళ్లను మట్టికరిపించింది.  ఈ ఫైనల్ ఆడడంద్వారా రన్నరప్ జెంగ్ కూడా ఒక రికార్డును నెలకొల్పింది. డబ్ల్యుటీఏ ఫైనల్స్ ఆడిన రెండో చైనీస్ టెన్నిస్ క్రీడాకారిణిగా జెంగ్ అవతరించింది.