calender_icon.png 19 October, 2024 | 6:16 AM

పన్నూ హత్యకు కుట్ర కేసులో ట్విస్ట్

19-10-2024 01:48:47 AM

భారత ‘రా’ అధికారిపై అమెరికా అభియోగాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌సింగ్ అలియాస్ పన్నూ హత్యకు కుట్ర కేసుపై దర్యాప్తు చేస్తున్న అమెరికా.. భారత నేర విభాగం (రా) మాజీ అధికారి వికాస్‌యాదవ్‌పై అభియోగాలు మోపింది. పన్నూ హత్యకు ప్లాన్ చేసిన నిందితుల్లో వికాస్ యాదవ్ కూడా ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాను అమెరికా పోలీసుల కస్టడీలో ఉండ గా తాజాగా భారత రా ఏజెంట్‌పై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

న్యూయార్క్‌లోని న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో.. పన్నూ హత్యకు కిరాయి వ్యక్తులను నియమించి వికాస్ యాదవ్ కుట్ర చేశాడని అమెరికా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వికాస్ పరారీలో ఉన్నట్లు పేర్కొంది. పన్నూపై హత్యకు కుట్రపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ స్పందిసూ.. అమెరికాలో నివాసం ఉంటూ.. హక్కులను పొందినవా రిపై ప్రతీకారం తీర్చుకోవడానికి హింసాత్మక చర్యలు, ఇతర ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోం అన్నారు. తమ భూభాగ ంపై గతేడాది పన్నూ హత్యకు కుట్ర జరుగగా తాము భగ్నం చేసినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. భారత ఉద్యోగితో కలిసి పన్నూ హత్యకు నిఖిల్ పన్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.