15-04-2025 12:00:00 AM
గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ..
ముషీరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): చట్ట సభల్లో బీసీలకు రిజర్వేన్ అమలైనప్పుడే అంబేడ్కర్ కు నిజమైన నివాళి అని గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యేలికట్టే విజయకుమార్ గౌడ్ లు అన్నారు. ఈ మేరకు సోమవారం డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ 134వ జయంతిని సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలాలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం చిక్కడపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చట్ట బద్దం చేస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించడం జరిగింది అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్లో కేంద్ర ప్రభుత్వం చర్చించకుండా కుట్రలు చేస్తుంది అన్నారు. తక్షణమే పార్లమెంట్లో తీర్మానం చేసినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో ఎమ్బి రమణ, అంబాల నారాయణ గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్, ఎస్. దుర్గయ్య గౌడ్, సింగం నాగేశ్వర్ గౌడ్ పోతగాని ఐలయ్య, వి. నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన జయంతి వేడుకల్లో బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నాగేష్ ముదిరాజ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జెల్ల భిక్షపతి, నాగభూషణం, శ్రీను, రాజేష్, నాగ సాయి, రమేష్ పాల్గొన్నారు.