మెదక్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో మెదక్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో తపాలా శాఖ అధికారులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు జాతీయ పతాకాన్ని అందజేశారు.
ముషీరాబాద్: కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ఎన్‌సీసీ విద్యార్థులు కవాడిగూడ ప్రధాన రహదారులతో పాటు ట్యాంక్‌బండ్‌పై జాతీయ జెండాలను చేతబూని భారీ కవాతు నిర్వహించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో: బీజేపీ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద తిరంగా ర్యాలీ నిర్వహించారు.