calender_icon.png 24 December, 2024 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రి చేత అవార్డు అందుకున్న మహిళలకు సన్మానం

23-12-2024 10:08:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర జల శక్తి మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మహిళా సంఘ సభ్యులను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. కొండాపూర్ కు చెందిన లక్ష్మీ భాగ్యాలు ఒక ఎకరంలో సేంద్రీయ విధానంపై ఢిల్లీ స్థాయిలో అవార్డు అందుకోవడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. వారిని శాలువతో సన్మానించి మెమొంటోను అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.