26-04-2025 12:00:00 AM
బౌద్ధనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు :సాయి ప్రసాద్ గౌడ్
వారసిగూడాఏప్రిల్ 25 (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద గాడిని తీవ్రంగా ఖండిస్తు బౌద్ధ నగర్ లో శాంతిర్యాలీ నిర్వహించి వారి ఆ త్మలకు శాంతించాలని భగవంతుని కోరుతూ బౌద్ధనగర్ నుండి వారసిగూడా చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించి అనంతరం సాయి ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఘటనలో ఇప్పటివరకు 29 మందికి పైగా మరణించడం మతం అడిగి చంపడం బాధాకరమని సాయి ప్రసాద్ గౌడ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో ప్రేరేపిస్తున్న ఈ ఉగ్రదాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొని తగిన బుద్ధి చెబుతుందని సాయి ప్రసాద్ గౌడ్ హెచ్చరించడం జరిగింది ఈ ఉగ్రదాడికి పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించు కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి విరసిల్లి పర్యాటకం ఎంతో అభివృద్ధి చెందిందని, దీంతో జమ్ము కాశ్మీర్ ప్రజలు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు శాంతియుతంగా ఆనందంగా జీవించడం జీర్ణించుకోలేని పాకిస్తాన్ ఈ ఉగ్రదా డులకు ప్రేరేపించిందని ఆయన విమర్శించారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ కి బుద్ధి చెప్పి పుల్వామా వంటి ఉగ్ర దాడులను కూడా భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ తన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి చర్యలను భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తగిన విధంగా బుద్ధి చెబుతుందని సాయి ప్రసాద్ గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగేశ్వర్ రెడ్డి. కనకట్ల హరి. భాస్కర్ గిరి.మ ద్దెర్ల శామ్ సుందర్ . దత్తు. కొమరయ్య.నేతి సత్యనారాయణ. అజయ్. చైతన్య. నగరపు శామ్. సంపత్. కుమార్. సారథి. లడ్డు. ఓములు. భాస్కర్ గౌడ్. నాగేష్.ఉమాపతి. సందీప్. పంపరి యాదగిరి. ఉపేందర్. సిని మా రాజు. బట్టల శీను. స్టవ్ సత్తి. సురేష్. అమరావతి. వెంకటేష్ యాదవ్. వెంకటేష్ ముదిరాజ్. శ్రీకాంత్. లింగం. నీలెష్. పద్మారావు. రాజ్ కుమార్ నేత. సతీష్ నేత. అశోక్. సాయినాథ్. వేణుగోపాల్ చారి. జయరాజ్. దీపక్. రూపసాయి. తదితర డివిజన్ నాయకులు పాల్గొనడం జరిగింది.
ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళి
మహేశ్వరం, ఏప్రిల్ 25: మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ లోని తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కాశ్మీర్ పహ ల్గాం మైదానంలో ఉగ్రవాదుల తూటాలకు ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావగా విద్యార్థిని, విద్యార్థులు తో కలిసి కొవ్వొత్తుల ర్యాలీలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాదులు పాశవికం గా కాల్పులు జరిపి అమాయక ప్రజలను దారుణంగా చంపడం ఉగ్రవాదుల పైశాచికానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఉగ్రవాదు ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది మానవాళిపై జరిగిన దాడి అని ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.చనిపోయిన మృతు లకు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజ మాన్యం పాల్గొన్నారు
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దేశానికి అండగా నిలుస్తాం
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్. రాంబాబు
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దేశానికి అండగా నిలుస్తామని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్. రాంబాబు తెలిపారు. పహల్గామ్లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి బ్యాంకు ఉద్యోగులను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ భయంకరమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పహల్గామ్లో అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ హైదరాబాద్, కోఠి, బ్యాంకు స్ట్రీట్ లో శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
వందలాదిమంది బ్యాంకు ఉద్యోగులు ప్లకార్డులు చేతబూని ఉగ్రవాదం నశించాలి, శాంతిని కాపాడాలి, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున నినాదాలు చేసి, కొవ్వత్తులు వెలిగించి బాధితులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బి.ఎస్. రాంబాబు మాట్లాడుతూ పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి బ్యాంకింగ్ వర్గాలకు తీవ్ర దుఃఖం, కోపాన్ని కలిగించిందని అన్నారు. ఈ విషాదకరమైన ఉగ్రవాద దాడిలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు జె. చంద్ర మౌళి, శైలేష్ భాయ్ కాలాతియా బలికావడం బ్యాంకు ఉద్యోగులను తీవ్రంగా కలచివేసిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ దాడిని నాగరిక సమాజంపై ఒక మచ్చగా అభివర్ణిస్తూ, బాధ్యులను త్వరగా మరియు కఠినం గా శిక్షించాలని అయన కోరారు. శాంతి, ఐక్యత, పురోగతి కోసం ప్రయత్నిస్తున్న సమాజంలో ఇటువంటి ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని అయన నొక్కి చెప్పారు. అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం గట్టిగ ప్రయత్నించాలని, బ్యాంకు ఉద్యోగులుగా కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావంగా ఉంటామని, ఎల్లప్పుడూ శాంతి కోసం నిలబడతామని బి.ఎస్. రాం బాబు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఆంధ్ర ప్ర దేశ్, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు టి. రవీంద్రనాథ్, సంయుక్త కార్యదర్శి పి.వి. కృష్ణ రావు, ఉప ప్రధాన కార్యదర్శులు సమద్ ఖాన్, ఉదయ్ భాస్కర్, అజయ్ కుమార్, ఏఐబిఓఏ ప్రధాన కార్యదర్శి ఫణి కుమార్ పాల్గొన్నారు.
బాధితులకు నివాళులు...
మహేశ్వరం, ఏప్రిల్ 25 : పహలగామ్ యాత్రికులపై దాడి చేసిన ముష్కర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త, అక్షిత ఫౌండేషన్ అధ్యక్షులు సన్నీ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్‌లో ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలం టూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పహాలగామ్ లో ముష్కర్ల దాడిలో మృతి చెందిన యాత్రికులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం అని ఆ యన ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులంతా ఐ క్యంగా ఉంటూ ముష్కర్ల దారుల ను తిప్పుకొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.