లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీ పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల, కో- ఆప్షన్ సభ్యుల పదవీ కాలం పూర్తి అయిన సందర్భంగా సోమవారం పాలకవర్గ వీడ్కోలు అభినందన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ.. మున్సిపల్ పాలకవర్గం చేసిన అభివృద్ధి సేవలను కొనియాడారు. ఈ అభినందన సభలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, వైస్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, గురువయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.