calender_icon.png 2 November, 2024 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతృభాషపై మమకారం.. గోండి భాషలో మహాభారతం!

07-07-2024 02:35:11 AM

  • ఏఐ యాంకర్‌ను సృష్టించి గోండి భాషలో వార్త ప్రసారం.. 
  • నేడు గోండి భాష మహాభారతం పుస్తకం ఆవిష్కరణ

ఆదిలాబాద్, జూలై 6 (విజయక్రాంతి) : ఆయన ఓ ప్రభుత ఉపాధ్యాయుడు. పాఠశాలలోని పిల్లలకు సాంఘిక శాస్త్రం పాఠాలు బోధించడం తన వృత్తి. అయితే, తన మాతృభాషను పరిరక్షించడంతోపాటు భావితరాల కు దాని గొప్పదనాన్ని తెలియజేసేందుకు ఆయన శ్రమిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది ఆదివాసీల జిల్లా అని. ఈ జిల్లాలో ఎక్కువగా ఆదివాసీ తెగల వారు తమ జీవనాన్ని సాగించడం, అందులో గోండ్ తెగ ఒకటి.

అయితే ఈ గోండ్ తెగ వారికి గోండి భాష ప్రత్యేకంగా ఉంటుంది. గోండి భాషలోనే వారు మాట్లాడుతారు. కానీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో గోండి భాష మాట్లాడటం తగ్గుతున్నది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని వాఘాపూర్ వాసి గోండ్ తెగకు చెందిన ప్రభుత ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ గోండి భాష పరిరక్షణకు నడుంబిగించాడు. గోండ్ తెగల వారికి అర్థం అయ్యే రీతిలో, ముఖ్యంగా యువత ఈ గోండి భాష పట్ల పట్టు సాధించేందుకు గోండి భాషలో పలు పుస్తకాలను రాస్తున్నారు. భారతదేశ మూలాలకు కారణమైన మహాభారతంలోని ౧౮ పర్వాలను గోండి భాషలోకి అనువదించి తన మాతృ భాష పరిరక్షణకు కృషి చేస్తున్నారు.  

గోండి భాష లో రాసిన పుస్తకాలు 

తొడసం కైలాస్ గోండి భాషలో పలు పుస్తకాలను రాశారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథల పుస్తకాలు, విరాట్ కోహ్లీ జీవితంపై గోండి భాషలో పుస్తకం, అదేవిధంగా మంచి ఆలోచన అనే పుస్తకాన్ని రచించారు. తాజాగా మహాభారతంను తమ గోండి భాషలోకి అనువదించారు.

గోండి భాష ప్రచారానికి ఏఐ యాంకర్ రూపకల్పన 

తమ పూరీకుల నుంచి వస్తున్న గోండి భాష ప్రచారానికి కైలాస్ సాంకేతికతను సైతం వాడుకుంటున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ తరగతుల బోధనతోపాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న తరుణంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్) యాంకర్‌ను సైతం రూపొందిం చారు. ఈ ఏఐ యాంకర్‌తో గోండి భాషలో వార్తలను, ఇతర కథలను ప్రచారం చేసేందుకు కైలాస్ తొడసం వోల్గా అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ సైతం నెలకొల్పారు.  

నేడు మహాభారతం పుస్తకావిష్కరణ 

మా గోండి భాషను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే అనేక పుస్తకాలు రచించాను. తాజాగా మహాభారతాన్ని గోండి భాషలో పండో క్న మహాభారత్ కథ పేరిట అనువదించారు. ఈ పుస్తకాన్ని సోమవార ఆదిలా బాద్ జెడ్పీ సమావేశ మందిరంలో ఆవిష్కరిస్తున్నాం. గొండ్ తెగల వారి వృత్తి పచ్చబొట్లు వేయడం. అందు కే మా వృత్తి పరిరక్షణలో భాగంగా నా చేతులపై శివుని ప్రతిమ లతో కూడిన పచ్చబొట్లులు వేయించుకున్నా.

 తొడసం కైలాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పుస్తక రచయిత