28-02-2025 08:17:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో గల జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డే పురస్కరించుకుని సైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వినోద్ కుమార్, నారాయణ, హరిప్రసాద్, సురేష్, అశోక్ తదితరులు ఉన్నారు.