calender_icon.png 3 April, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళి

03-04-2025 12:56:59 AM

ఖమ్మం, ఏప్రిల్ 2 ( విజయక్రాంతి ):- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఘన నివాళులు అర్పించారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొని.

అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వారి ఆశయ సాధనకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా బీసి అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, గౌడ సంఘం నాయకులు మిత్రు గౌడ్, అంజయ్య, ప్రతినిధులు, ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టరెట్ పరిపాలన అధికారి ఎన్. అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.